calender_icon.png 20 April, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి ఆమడ దూరంలో అపరభద్రాది

04-04-2025 01:05:29 AM

  • 9 ఏండ్లు గడుస్తున్నా ఇంకా జరగని అభివృద్ధి
  • ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోని అధికారులు

హుజురాబాద్, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి): అపరభద్రాద్రిగా పేరు గాంచిన సీతారామచంద్రస్వామి కొలువు దీరిన ఇల్లందకుంట మండల కేంద్రం అభివద్ధికి నోచుకోవడం లేదు. కరీంనగర్ జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న ఆ ప్రాంత అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉందని చెప్ప వచ్చు.  జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 2016లో ఇల్లందకుంట మండలాన్ని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మండలం ఏర్పడి 9 ఏండ్లు గడుస్తున్నా మండల కేంద్రంతోపాటు సమీప పరిసరాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగ లేదు. ఇల్లందకుంట టెంపుల్ నుండి సిరిసేడు పోయే రోడ్డు గుంతలు ఏర్పడి వచ్చే భక్తులకు తిప్పలు తప్పవు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన పట్టించు కోవడం లేదని, జాతర సమయంలో నామమాత్రంగా మొరం పోసి వదిలేస్తున్నారని భక్తు లు ఆరోపిస్తున్నారు.

శ్రీరామ నవమి సందర్భంలో మినహా దేవాలయపై ప్రభుత్వం దష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి. ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు, బీఆర్‌ఎస్ లీడర్ల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. కానీ, ఇరువురూ ప్రజా సమస్య లను పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. పాలకులు ఇల్లందకుంట మండల అభివృద్ధిపై దష్టి సారిస్తే భద్రాచలంలా మార్చవచ్చని ప్రజలు భావిస్తున్నారు.

మండలకేంద్రంలో పరిశ్రమను కానీ కేంద్ర పరిధి లోని ట్రిపుల్ ఐటీని  ఏర్పా టు చేయడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు ఏర్పడటంతో పాటు ఇల్లందకుంట అభివద్ధి చెందే అవకాశాలుంటాయి.  నాయకులు తమ వంతు కషిని చిత్తశుద్ధితో చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. సీతా రాముడు నడయాడిన నేలను దర్శించుకునేందుకు లక్ష లాది మంది భక్తులు వచ్చే ఈ గద్ద అభివద్ధికి నవమి రోజ నాయకులు ఏమి హామీ ఇస్తారో చూడాలి.