* న్యూఇయర్ వేడుకలకు వెళ్లి విగతజీవిగా..
పనాజీ, జనవరి 3: నూతన సంవత్సర వేడుకలు జరుపుకొనేందుకు గోవా వెళ్లిన ఏపీ యువకుడు హత్యకు గురయ్యాడు. సోమవారం రాత్రి ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బొల్లా రవితేజ (28) తన స్నేహితులతో కలిసి గత నెల 28న గోవా చేరుకున్నాడు.
రవితేజ, స్నేహితులు 30వ తేదీ రాత్రి కలంగుట్ బీచ్‌కు వెళ్లి సరదాగా గడిపారు. తర్వాత పక్కనే ఉన్న ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఈ క్రమంలో రెస్టారెంట్‌లో ఫుడ్ ధరలు ఎందుకు అధికంగా ఉన్నాయని స్నేహితుల బృందంలో ఓ యువతి యాజ మాన్యాన్ని ప్రశ్నించింది.
ఈక్రమంలో రెస్టారెంట్ యజమాని కుమారుడు సుబెట్ సిల్వేరా సదరు యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. రవితేజతో పాటు అతడి స్నేహితులు ఎదురుతిరిగారు. రెస్టారెంట్ సిబ్బంది వెంటనే కర్రలతో దాడిచేశారు. ఘటనలో స్నేహితులకు స్వల్పగాయాలు కాగా, తీవ్రగా యాల పాలైన రవితేజ అక్కడికక్కడే మృతిచెందాడు.
మృతుడి కుటుంబ సభ్యులు రవితేజ మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరగా.. ప్రభుత్వం రవితేజ మృతదేహాన్ని తాడేపల్లిగూడేనికి తీసుకొచ్చింది.