అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాం తి): ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీలో సోమవా రం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యా యి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2024 ఆర్థిక సంవత్సరానికి అసెంబ్లీలో రూ.2.94 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,35,916.99 కోట్లు కాగా, మూలధన వ్యయం అంచనా రూ. 32,712.84 కోట్లు. అలాగే రెవెన్యూ లోటు రూ.34,743.38 కోట్లు కాగా, ద్రవ్యలోటు రూ. 68,742.65 కోట్లు.
తల్లికి వందనం.. ఉచిత బస్సు సౌకర్యం
తమ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేసి తీరుతుందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ‘తల్లికి వందనం’ పథకానికి విరివిగా నిధులు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం, వారికి తల్లులకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. చదువుకునేందుకు పేదరికం అడ్డుకాకూడదని తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు.
త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. తర్వాత వ్యవ సాయశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
శాఖల వారీగా కేటాయింపులు ఇలా
పాఠశాల విద్య రూ.29,909 కోట్లు
వ్యవసాయ, అనుంబంధ రంగాలు రూ.11,855 కోట్లు
ఎస్సీ సంక్షేమం రూ. 18,497 కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు
బీసీ సంక్షేమం రూ.39,007 కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ.4,376 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమం రూ.4,285 కోట్లు
మానవ వనరుల అభివృద్ధి రూ.1,215 కోట్లు
ఉన్నత విద్య రూ.2,326 కోట్లు
వైద్యారోగ్య రంగం రూ.18,421 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రూ.16,739 కోట్లు
పట్టణాభివృద్ధి రూ.11,490 కోట్లు
గృహ నిర్మాణం రూ.4,012 కోట్లు
జలవనరులు రూ.16,705 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు
ఇంధన రంగం రూ.8,207 కోట్లు
రవాణా, రోడ్లు, భవనాలు రూ.9,554 కోట్లు
పోలీస్‌శాఖ రూ.8,495 కోట్లు
పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ రూ.687 కోట్లు