calender_icon.png 27 April, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

23-04-2025 11:50:29 AM

ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు 

ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌

ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు(AP SSC 10th Results 2025) విడుదలయ్యాయి.  విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Education Minister Nara Lokesh) ఫలితాలను బుధవారం వెల్లడించారు. పదోతరగతి పరీక్షల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 81.14 శాతంగా నమోదైంది. 6,14,459 మంది విద్యార్థులలో 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారని ప్రకటించారు. ఏపీ పదోతరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి. బాలికలు 84.09 శాతం, బాలురు 78.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. 93.90 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉంది. 47.64 శాతం ఉత్తీర్ణతతో సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 1,680 పాఠశాలల్లో వందశాతం ఫలితాలు నమోదయ్యాయి. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.

ఉత్తీర్ణత సాధించనివారు నిరుత్సాహపడవద్దని మంత్రి లోకేశ్(Minister Nara Lokesh) సూచించారు. మే 19 నుంచి 28 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్, results.bse.ap.gov.in లేదా bie.ap.gov.in ని సందర్శించడం ద్వారా వారి ఫలితాలను తనిఖీ చేయవచ్చని మంత్రి స్పష్టం చేశారు. మనమిత్ర వాట్సప్, లీప్ యాప్ లోనూ పదోతరగతి ఫలితాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వాట్సప్ నెంబర్ 9552300009కు హాయ్ మెసేజ్ పంపినా ఫలితాలు వస్తాయని చెప్పారు. ఈ సంవత్సరం, ఈ పరీక్ష మార్చి 17, 2025 నుండి మార్చి 31, 2025 వరకు నిర్వహించబడింది, దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. చాలా రోజులలో, పరీక్ష ఉదయం షిఫ్టులలో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరిగింది. పరీక్ష మొదటి భాష (గ్రూప్ A) పేపర్‌తో ప్రారంభమై సోషల్ స్టడీస్ పేపర్‌తో ముగిసింది.