హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): సంక్రాంతి సీజన్‌లో ఏపీఎస్ ఆర్టీసీకి రికార్డుస్థాయిలో ఆదాయం సమకూరిందని అధికారులు పేర్కొన్నారు. జనవరి 8 నుం చి 20 వరకు సంస్థ 9,097 ప్రత్యేక బస్సులను నడిపింది. ఈ నెల 20న ప్రయాణికుల ద్వారా ఒకే రోజే రికార్డుస్థాయిలో రూ.23.71 కోట్ల ఆదా యం సమకూరింది. మూడు రోజులపాటు రోజుకు రూ.20 కోట్ల చొ ప్పున ఆదాయం వచ్చినట్టు సంస్థ తెలిపింది.