calender_icon.png 26 December, 2024 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైఎస్ భారతి పీఏ వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్

08-11-2024 06:43:56 PM

అమరావతి,(విజయక్రాంతి): వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న వర్రా రవీందర్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులోని మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో రవీందర్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కడప పోలీసుల నుంచి రవీందర్ రెడ్డి తప్పిచుకున్నాడు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి అనితపై అసభ్యంగా దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడు. అలాగే షర్మిల, విజయమ్మపై కూడా పెట్టాడు.

తాజాగా ఓ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అక్కడ 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని కోరారు.మరో కేసు గురించి మాట్లాడేలోపే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కడప, రాజంపేట, మంగళగిరి పోలీస్ స్టేషన్లలో రవీందర్ రెడ్డిపై ఇప్పటి వరకు సుమారుగా 30 కేసులున్నట్లు సమాచారం. వైసీపీ సామాజిక కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ హయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతి పీఏగా కూడా పని చేశాడు.