27-02-2025 11:24:26 AM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(N. Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసినందుకు అందిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నటుడు, రాజకీయ నాయకుడు పోసాని కృష్ణ మురళిని(Posani Krishna Murali) ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ (వైఎస్ఆర్సీ) అధికారంలో ఉన్నప్పుడు పోసాని ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ కాలంలో ఆయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌పై అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లలో పోసానిపై అనేక కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల్లో ఒకటి అన్నమయ్య జిల్లాలోని సాంబేపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. ఈ కేసుపై చర్య తీసుకుంటూ, ఏపీ పోలీసు అధికారులు గచ్చిబౌలిలోని పోసాని నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు.కాసేపపట్లో పోసాని కృష్ణ మురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె(Annamayya District Obulavaripalle)కు తీసుకువెళ్లనున్నారు. రైల్వేకోడూరు కోర్టులో పోసానిని మధ్యాహ్నం హాజరుపరిచే అవకాశముంది. సిసీ పరిశ్రమపై పోసాని తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. చెన్నరాజుపోడు మాజీ సర్పంచ్ జోగినేని మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మూడ్రోజుల క్రితం పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ లో 196,353(2),111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.