calender_icon.png 19 April, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీబీ లింక్‌పై ఏపీ జీవో

12-04-2025 01:05:02 AM

తెలంగాణ తీవ్ర అభ్యంతరం 

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): గోదావరి జలాలను కృష్ణా బేసిన్ మీదుగా పెన్నాబేసిన్‌కు తరలించేందుకు ఏపీ సర్కార్ నిర్మించతలపెట్టిన గోదావరి- బనకచర్ల లింక్ (జీబీ లింక్)కు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా జీవో 16ను జారీ చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇందులో భాగంగా గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ)తో పాటు పోలవరం అథారిటీకి తాజాగా లేఖ రాసింది. జీబీ లింక్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ ప్రాజెక్టును ఏపీ ముందుకు తీసుకెళ్లకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఏపీ విడుదల చేసిన జీవో 16 కాపీని లేఖకు జత చేసింది.

ఇప్పటికే ఈ విషయాన్ని అటు కేంద్ర జల్‌శక్తి మంత్రి, ఇటీవల జరిగిన జీఆర్‌ఎంబీ సదస్సులో చైర్మన్ దృష్టికి సైతం తెలంగాణ సర్కార్ తీసుకెళ్లింది. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు పోకుండా చూస్తామని స్పష్టం చేసింది.