calender_icon.png 20 January, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతం

12-07-2024 02:11:49 AM

ఏపీ సీఎం చంద్రబాబు నాయడు

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి) : రాష్ట్రంలో యువత నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. గురువారం విశాఖలో నిర్వహించిన సీఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేందుకు స్కిల్ సెన్సస్ గ్లోబల్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతమని, విశాఖను ఫిన్‌టెక్ హబ్‌గా తీర్చిది ద్దుతామని హామీ ఇచ్చారు. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఫార్మా, ఆటోమొబైల్, హార్డ్‌వేర్ రంగాల్లో విస్తృత అవకాశాలున్నట్లు తెలిపారు.