అమరావతి,(విజయక్రాంతి): బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం కొట్టివేసింది. నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులే పనిగా పెట్టుకున్నారా అని వ్యాఖ్యానించిన హైకోర్టు అసభ్యకర పోస్టులు పెట్టే ఇలాంటి వారిని క్షమించకుడానికి వీల్లేదంది. పిటిషనర్ కు పూర్వ నేర చరిత్ర ఉందని కోర్టు తెలిపిన ఏపీ పోలీసులు అనుచిత పోస్టుల వ్యవహారంలో ఇప్పటికే నమోదైన రెండు కేసుల్లో ఛార్జిషీట్ దాఖలైందన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో బోరుగడ్డ అనిల్ పై కేసు నమోదైందని పోలీసులు వెల్లడించారు. దీంతో తనకు బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన బోరుగడ్డ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది.