అవరావతి,(విజయక్రాంతి): వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తుల రక్షణే తొలి ప్రాధాన్యమనే విధంగా ఏపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పరాయి భూములపై కన్నేయాలంటేనే భయపడేలా చట్టం తీసుకొస్తున్నామని, భూ హక్కుల సమస్యల్లేని రాష్ట్రమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆంజనేయులు పేర్కొన్నారు. అధికారులే గ్రామాలకు వస్తారని, 45 రోజుల్లోనే భూసమస్యలకు పరిష్కారం చూపిస్తారని చెప్పారు. వైసీపీ పాలనలో భూదందాలపై కొన్ని నెలలుగా ప్రభుత్వానికి వేల ఫిర్యాదులు వచ్చిన పట్టించుకోలేదని ఆరోపించారు. టీడీపీ సభ్యత్వ నమోదులో వినుకొండ 4వ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని జీవీ ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు.