అమరావతి,(విజయక్రాంతి): రామ్ చరణ్ కథానాయకుడిగా, కియారా అడ్వాణి కథనాయికగా శంకర్ దర్శకత్వంలో నిర్మించిన పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రక్సేకుల ముదుగు రానుంది. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ చిత్రం టికెట్ ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం అనుమతించింది. టికెట్ ధరల పెంపుతో పాటు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తూ ఏపీ సర్కార్ సర్క్యులర్ జారీచేసింది.
గురువారం అర్థరాత్రి 1 గంట నుంచి ఉదయం 4 గంటల వరకు ప్రత్యేక బెనిఫిట్ షో టికెట్ ధర పన్నులతో కలిపి రూ.600 చొప్పున విక్రయించుకునేందుకు అనుమతించింది. జనవరి 10వ తేదీన ఆరు షోలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ అనుమతించింది. మల్లీప్టెక్స్ లో అధనంగా రూ.175, సింగిల్ థియేటర్లలో రూ. 135 వరకూ టికెట్ పెంచుకునేందుకు తెలిపారు. జనవరి 11 నుంచి 23 వరకు ఇవే ధరలతో రోజు ఐదు షోలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించినట్లు పేర్కొంది.