calender_icon.png 30 April, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింహాచలం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం

30-04-2025 09:46:03 AM

అమరావతి: విశాఖపట్నం జిల్లాలోని సింహాలచం ప్రమాద(Simhachalam Temple Wall Collapse) మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Govt) పరిహారం ప్రకటించింది. సింహాచలం ప్రమాద ఘటనపై సిఎం చంద్రబాబు ఉన్నతాధికారులు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు(Chief Minister Chandrababu)  జిల్లా అధికారులతో మాట్లాడి ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలను సిఎం తెలుసుకున్నారు. 

గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు సిఎం ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకున్న విషయం తెలిపిందే. బుధవారం తెల్లవారుజామున భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులున్నారు.