calender_icon.png 7 November, 2024 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగాళాఖాతంలో అల్పపీడనం.. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

19-07-2024 11:05:42 AM

అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు మేరకు విపత్తుల నిర్వాహణ శాఖ మంత్రి అనిత అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మంత్రి అనిత మాట్లాడారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామని తెలిపిన మంత్రి ప్రాణనష్టం.. పశు, పంట నష్టం నివారణకు చర్యలు తీసుకోవాలి మంత్రి అనిత వెల్లడించారు.

గురువారం రాత్రి సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. రాష్ట్రంలో వర్షాలు‌ తీవ్రంగా నమోదు కావడంతో అధికారులను అలెర్ట్ చేసిన‌ ముఖ్యమంత్రి, ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దవాగుకు రెండు చోట్ల గండిపడే ప్రమాదం ఉండటంతో, ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సీఎం ముందస్తు ఆదేశాలు జారీ చేసారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలని ఆదేశించారు.