calender_icon.png 24 April, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధుసూదన్ రావు భౌతికకాయానికి నివాళులర్పించిన ఏపీ డిప్యూటీ సీఎం

24-04-2025 04:01:50 PM

అమరావతి,(విజయక్రాంతి): జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కొల్పోయిన మధుసూదన్ రావు భౌతికకాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా కావలి వెళ్లి పవన్ శ్రద్ధాంజలి ఘటించి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్య పడొద్దని ప్రభుత్వం అని విధాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అంతకు ముందు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కావలి చేరుకొని మధుసూదన్ మృతదేహానికి నివాళులర్పించారు.

మంగళవారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఏకంగా 26 మంది మరణించిగా, పలువురికి గాయాలయ్యాయి. మరణించిన వారి మృతదేహాలను ఇవాళ వారి ఇళ్లకు చేరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు భౌతికకాయాన్ని చెన్నైకి పంపించి, అక్కడి నుంచి కావలికి చేర్పారు. కాన్పూర్‌కు చెందిన శుభమ్ ద్వివేది, నేపాల్‌కు చెందిన సుదీప్ మృతదేహాలను లక్నో విమానాశ్రయానికి తీసుకువచ్చారు, అక్కడ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ నివాళులర్పించారు.