కర్నాటక: ఏనుగుల సమస్యపై చర్చించేందుకు కర్ణాటక పర్యటనకు వెళ్లిన పవన్ కల్యాణ్ బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశమయ్యారు. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో కూడా చర్చలు జరిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని, అయితే నేటి హీరోలు అడవులను నరికి చెట్ల స్మగ్లర్లుగా చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు.
కర్నాటక పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా హీరోల గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.
40 ఏళ్ల క్రితం హీరో అడవులను కాపాడేవాడు.. కానీ, ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది ప్రస్తుతం మన సినిమా పరిస్థితి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తోందన్నారు. ఒకప్పుడు కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్ అడవులను కాపాడే హీరో పాత్ర వేశారన్న పవన్ కళ్యాన్ ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తే పాత్రలు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. ఒక సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం తనకు కష్టమని.. అది బయటకు మంచి మెజేజ్ ఇవ్వదన్నారు.
రీల్ లైఫ్‌లో చేయలేని పనిని ఇక్కడ చేయాలనుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ సాంస్కృతిక మార్పు తనకు మనోహరంగా ఉందని అన్నారు. పిఠాపురంలో తనను ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, పర్యావరణ సమతుల్యతను పెంపొందించడానికి మాతృభూమిని రక్షించుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సినిమాలో హీరోల పాత్రపై చర్చకు దారితీశాయి.