calender_icon.png 15 January, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగళూరుకు పవన్‌ కల్యాణ్

08-08-2024 12:05:24 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు బయలుదేరారు. కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రేతో పవన్ సమావేశం కానున్నారు. చిత్తూరు జిల్లా పరిధిలోను, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరం. కుంకీ ఏనుగులు కర్ణాటక దగ్గర ఉన్నాయి. కొన్ని కుంకీ ఏనుగులు మన రాష్ట్రానికి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖను కోరడం ఈ రోజు చర్చల్లో ప్రధానంగా చర్చించనున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్రచందనం దోపిడీని అరికట్టేలా పవన్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.