హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు భారీ ర్యాలీగా ఎన్టీఆర్ భవన్కు బయలుదేరారు. ఏపీలో విజయం తర్వాత చంద్రబాబు తొలిసారి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్కు వచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఎన్టీఆర్ భవన్కు వచ్చిన చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశంకానున్నారు. అనంతరం ఏపీ సీఎం ఆదివారం సాయంత్రం తిరిగి విజయవాడకు పయనం కానున్నారు.