బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీ 2024 లో మెల్బోర్నలో జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా(Ind vs Aus) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) అద్భుతమైన సెంచరీ సాధించి సర్వత్రా ప్రశంసలు అందుకున్నాడు. అత్యద్భుతమైన ఆట కనబరిచిన నితీష్ కుమార్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ అభినందించారు.
“నాల్గవ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించిన విశాఖపట్నం యువ క్రికెటర్ కె. నితీష్ కుమార్ రెడ్డి(Visakhapatnam cricketer Nitish Kumar Reddy)కి అభినందనలు. టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా అతడు నిలవడం సంతోషాన్ని కలిగిస్తోంది. నితీష్ రంజీ మ్యాచ్‌లలో ఆంధ్రాకు అనేక విజయాలు అందించాడు. అండర్ -16 స్థాయిలో రాణించాడు. అతను ఇలాంటి సెంచరీలు మరెన్నో సాధించాలని కోరుకుంటున్నాను. అతను భారత క్రికెట్‌కు గర్వం, కీర్తిని తీసుకురావాలని ఆశిస్తున్నాను' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. మక్కువ క్రికెట్ ఔత్సాహికుడు, ప్రముఖ టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్(Actor Daggubati Venkatesh) కూడా నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించాడు. "ఎంత అద్భుతమైన ప్రదర్శన..! 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేయడం అభినందనీయం. వాషింగ్టన్ సుందర్‌తో అతని భాగస్వామ్యం అసాధారణమైనది. తన అరంగేట్రం టెస్ట్ సిరీస్‌లో నితీష్ అద్భుత ప్రదర్శనను చూడటం గర్వించదగ్గ విషయమని వెంకటేష్ పేర్కొన్నాడు.