ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మార్మోగుతోంది
మన పరిపాలన బాగుంటే.. కేంద్రం చూయూత
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్ ఢిల్లీని "ఫెయిల్యూర్ మోడల్"గా మార్చిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) పాలనా నమూనా మాత్రమే దేశ రాజధానిని రక్షించగలదని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సూచించారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఇటీవల దావోస్ పర్యటన(Chandrababu Davos visit)లోనూ గమనించానని చెప్పారు. గతంలో ఐటీపై.. ఇప్పుడు ఏఐపై దృష్టి పెరిగిందని వివరించారు. ఏఐ సాంకేతికత(Artificial intelligence technology)లో భారత్ ముందుందన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మార్కోగుతోందని చంద్రబాబు వెల్లడించారు. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. నిన్నటి బడ్జెట్ కేటాయింపులు చూస్తే అర్థమవుతోందని తెలిపారు.
వికసిత్ భారత్(Viksit Bharat) లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్(Budget 2025) కేటాయింపులు ఉన్నాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. పన్ను సంస్కరణల్లో చాలా మార్పులు జరిగాయని సీబీఎన్(N. Chandrababu Naidu) వెల్లడించారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు ఏపీలోనే ప్రథమంగా జరిగాయని చెప్పారు. ఎంఎస్ఎంఈ పాలసీ గేమ్ ఛేంజర్(Game Changer) గా మారబోతోందన్నారు. ఇప్పుడు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్ షిప్ విధానమే అన్నారు. భారత్ లో పెట్టుబడులకు చాలామంది ముందుకొస్తున్నారు. పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి.
నూతన ఆవిష్కరణలతో పాటు మౌలిక సందుపాయాలు కల్పన పెరుగుతోందన్నారు. వృద్ధిరేటు పెంచేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యవేత్తల్లో భారతీయులే ప్రముఖంగా ఉంటున్నారని తెలిపారు. సంపద సృష్టించాలి.. అది పేదలకు పంచాలి.. సమ్మిళిత వృద్ధితోనే అభివృద్ధి సాధ్యం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎవరికి ఓట్లు వేస్తే అభివృద్ధి జరుగుతుందో ఆలోచించాలని సీఎం ఢిల్లీ ప్రజలను కోరారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు(BJP wins in Delhi).. దేశ ప్రగతికి మలుపు అన్నారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం(Delhi Air pollution)తో పాటు రాజకీయ కాలుష్యం కూడా ఉందన్నారు. అభివృద్ధికి ఢిల్లీ ఆమడదూరంలో ఆగిపోయిందని చంద్రబాబు ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కుకుందని విమర్శించారు.
అభివృద్థి కావాలంటే బీజేపీకి ఓట్లు వేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సంపద దోచుకునే వాళ్లు కాదు.. పంచేవాళ్లు కావాలని తెలిపారు. విభజనతోనే కాదు.. గత ప్రభుత్వ విధ్యంస విధానాలతో ఏపీ పూర్తిగా దెబ్బతిన్నదని సూచించారు. విధ్యంసంతో దెబ్బతిన్న రాష్ట్రానికి చేయూతనివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని(Central Government) కోరుతున్నామని సీఎం తెలిపారు. మన పరిపాలన బాగుంటే.. కేంద్రం చూయూత ఇస్తుందని సూచించారు. కేంద్రం చేయూత అందిస్తే ఏపీ అభివృద్ధి(AP development) పరుగులు తీస్తుందన్నారు. అన్ని రంగాల్లో జరిగిన విధ్వంసాన్నిఇప్పుడిప్పుడే చక్కదిద్దుతున్నామని సీఎం వెల్లడించారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నామని చంద్రబాబు(Chandrababu ) తెలిపారు.