calender_icon.png 22 October, 2024 | 2:49 PM

అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

22-10-2024 12:57:55 PM

విజయవాడ,(విజయక్రాంతి): అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. అమరావతి డ్రోన్ సమ్మిట్ కు కేేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు బీసీ జనార్థన్ రెడ్డి, అచ్చెన్న నాయుడు, అనిత, సంధ్యారాణి తదితరులు హాజరయ్యారు. ఈ డ్రోన్ సమ్మిట్ మంగళగిరిలోని సీకే కన్వెన్సన్ లో పౌరవిమానయాన శాఖ, డీఎఫ్ఐ, సీఐఐ భాగస్వామ్యంతో రెండ్రోజులపాటు జరుగునుంది. అమరావతి డ్రోన్ సమ్మిట్ లో 6,929 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక ఐటీపై దృష్టి సారించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధి కోసం ఆయన 15 రోజులపాటు అమెరికా వెళ్లి అనేక సంస్థలను కలిసినట్లు బాబు తెలిపారు.  ఆ రోజుల్లోనే పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించామని, ఐటీ, నాలెడ్జ్ ఎకానమీలో భారతీయులు చాలా సమర్థులు ఉన్నారన్నారు. డ్రోన్ టెక్నాలజీ... భవిష్యత్తులో గేమ్ ఛేంజర్ కానుందని ఏపీ సీఎం వెల్లడించారు. విదేశాల్లో ఉన్న మనదేశ ఐటీ నిపుణుల్లో 30 శాతం తెలుగువాళ్లే అని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు వస్తాయని, నివాస అనుకూల నగరాల్లో దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అని చంద్రబాబు గుర్తు చేశారు. డిజిటల్ కరెన్సీ లావాదేవీల్లో ప్రపంచంలో మనమే నెంబర్ వన్ అని, డేటా సాయంతో ఏఐ, ఎంఎల్ మరింత అభివృద్ధి చెందనున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.