20-04-2025 01:43:19 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం కూనవరం రోడ్ లోని సరోజిని వృద్ధ ఆశ్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలు పుట్టినరోజు వేడుకలు(AP CM Chandrababu birthday) తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సరోజినీ వృద్ధ ఆశ్రయం ముందుగా కేక్ కట్ చేసి అనంతరం అక్కడ ఉన్న వృద్ధులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కుంచాల రాజారామ్, కంభంపాటి సురేష్ పట్టణ నాయకులు నూతలపాటి దాసయ్య, కొడాలి చంటి, పోటు వెంకటేశ్వర్లు రేపాక రాంబాబు తదితరులు నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భద్రాచలం(Bhadrachalam) ప్రాంతం అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న సమయంలోనే జరిగిందని అన్నారు ముఖ్యంగా రహదారులు అభివృద్ధి ,100 పడకల ఆసుపత్రి ఏర్పాటు, తాళిపేరు బ్రిడ్జి నిర్మాణం, కరకట్ట నిర్మాణం, భద్రాచలం పట్టణంలో సెంట్రల్ లైటింగ్ చంద్రబాబు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండవీటి సుబ్రమణ్యం పల్లంటి దేశప్ప కొర్లపాటి రాము గున్నం రమేష్ తూము శ్రీను గారు మద్దుకూరు రమేష్ తోటకూర శ్రీహరి ఫ్రూట్స్ శ్రీను కొండవీటి నాగేశ్వరావు కొండవీటి రమేష్ నగేష్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.