calender_icon.png 20 April, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

20-04-2025 05:52:51 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు(AP CM Nara Chandrababu Naidu) జన్మదిన వేడుకలు మహబూబాబాద్ జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ పార్లమెంట్ టిడిపి కన్వీనర్ కొండపల్లి రామచంద్రరావు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు కలకాలం సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ చర్చి, దర్గా, దేవాలయాల్లో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు.

అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మందు పంపిణీ చేశారు. అలాగే కేసముద్రం మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏశబోయిన ఎల్లయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో టిడిపి నాయకులు వెంకటనారాయణ, రాము, సత్యనారాయణ, రంజిత్, వెంకటేశ్వర్లు, రామచంద్రమ్మ, హరికిషన్, నరేష్, బాసూమియా, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.