అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) 2025-26 కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. ప్రయోజనకరమైన ప్రగతిశీల బడ్జెట్‌గా అభివర్ణిస్తూ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని “విక్షిత్ భారత్” (Viksit Bharat) దార్శనికతను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తోందని చంద్రబాబు(Chandrababu ) పేర్కొన్నారు.
మహిళా సంక్షేమం, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి బడ్జెట్ ప్రాధాన్యతనిస్తోందని ఏపీ సీఎం ఉద్ఘాటించారు. వచ్చే ఐదేళ్లలో ఆరు కీలక రంగాల్లో అభివృద్ధిపై దీర్ఘకాలిక దృష్టితో కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. “ఈ బడ్జెట్(Union Budget 2025) దేశ సంక్షేమం వైపు కీలకమైన అడుగు సూచిస్తుంది. ఇది మన దేశానికి సంపన్నమైన భవిష్యత్తు కోసం సమగ్రమైన, ఖచ్చితమైన బ్లూప్రింట్‌గా పనిచేస్తుంది. అదనంగా, ఇది మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న మధ్యతరగతికి పన్ను మినహాయింపును అందిస్తుంది. ఈ బడ్జెట్‌ను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను' అని చంద్రబాబు నాయుడు ఎక్స్ లో ట్వీట్ చేశారు.