calender_icon.png 23 October, 2024 | 2:57 PM

కొనసాగుతున్న ఏపీ కేబినెట్‌ సమావేశం

23-10-2024 12:11:31 PM

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో కేబినెట్ ఉచిత గ్యాస్ సిలిండర్ల నిర్ణయాలకు, చెత్త పన్ను రద్దు నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. కొత్త రేషన్ కార్డు, డీలర్ల నియామకం, వాలంటీర్ల సర్వీసుపై చర్చించే అవకాశముంది. ప్రభుత్వం రేషన్ కార్డు, డీలర్లపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయనుంది. 13 కొత్త పురపాలికల్లో 190 పోస్టుల భర్తీపై కేబినేట్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆలయాల్లో పాలకమండళ్ల నియామకంలో చట్టసవరణ ప్రతిపాదనలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. నవంబర్ లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా చర్చించే అవకాశముంది. నవంబర్ నెలాఖరులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ముగియనుంది.

మంగళగిరి ప్రభుత్వాస్పత్రిని 100 పడకలుగా అభివృద్దికి ప్రతిపాదనపై, వైసీసీ ప్రభుత్వం రూ. 3,500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల అంశంపై చర్చించనున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో చీకటి జీవోలను వైబ్ సైట్ లోపునరుద్దరణపై చర్చించనున్నారు. మంత్రివర్గం ముందుకు శారదాపీఠం భూముల కేటాయింపు రద్దు అంశం రానుంది. జగన్ ప్రభుత్వం విశాఖ శారదాపీఠానికి 15 ఎకరాల భూమిని కట్టబెట్టింది. అత్యంత విలువైన భూమిని వెనక్కి తీసుకునే ప్రతిపాదనపై కేబినేట్ చర్చించనుంది. రూ. కోట్ల విలువైన భూమిని జగన్ ప్రభుత్వం ఎకరం రూ. లక్ష చొప్పున ఇచ్చేంది. అక్రమ భూకేటాయింపులపై సమీక్షలో ఎన్డేయే ప్రభుత్వం గుర్తించింది. కూటమి ప్రభుత్వం శారదాపీఠానికి భూ కేటాయింపులు రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉచిత ఇసుక, మద్యం విధానాలు, తదితర అంశాలపైనా కేబినేట్ లో చర్చించనున్నట్లు సమాచారం.