calender_icon.png 24 October, 2024 | 7:46 AM

ఏపీ అతలాకుతలం

02-09-2024 01:13:44 AM

విజయవాడ, గుంటూరు జిల్లాల్లో పలు ప్రాంతాలు నీటమునక

రాజధాని అమరావతిలోనూ అదే పరిస్థితి

తాగునీటి సరఫరాకు అంతరాయం..ప్రజల అవస్థలు

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటడంతో ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రెండు రోజుల పాటు కుంభవృ ష్టి కురవగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎన్టీఆర్, గుంటూ రు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో అత్యధికంగా విజయవాడలో 29 సెం.మీ వర్షం కురువగా, అమరా వతిలో 26.1, తిరువూరు 25.7, గుంటూరు 22.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.

వరదలకు విజయవాడ కకావికలం

ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు బుడమేర వాగు ఒక్కసారిగా ఉప్పొంగి విజయవాడపై విరుచుకుపడింది. దీంతో దుర్గ గుడి చుట్టుపక్కల బస్తీలన్నీ జలమయమయ్యాయి. మొగల్రాజపురం వాసులపై కొం డచరియలు విరిగిన ఘటన మరువకముందే బుడమేరువాగు విజయవాడను వదరల్లోకి నెట్టింది. దీంతో సింగ్ నగర్, చిట్టీనగర్ కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకు న్నాయి. రోడ్లపై అయిదు అడుగుల మేర నీళ్లు నిలిచాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పాటు మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, అధికార యంత్రాంగం వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. పలు రైళ్లు రద్దు కావడంతో రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కొన్నిచోట్ల పట్టా లపై నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బ ందులు ఎదురైతున్నాయి. దీంతో విజయవాడతో పాటు రాయనపాడు రైల్వేస్టేషన్లల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.

రికార్డు స్థాయిలో వర్షపాతం 

విజయవాడ సిటీలో 30 ఏండ్లో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు 29 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆటోనగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ శివారు కండ్రిగ వద్ద రహదారిపై భారీగా నీరు నిలిచింది.