calender_icon.png 6 March, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగన్కు ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో స్పీకర్ కీలక ప్రకటన

05-03-2025 10:20:19 AM

అమరావతి: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)కి ప్రతిపక్ష హోదాపై ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Speaker Ayyanna Patrudu) ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై జగన్‌ హైకోర్టుకు వెళ్లారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. జగన్ పిటిషన్ విచారణకు తీసుకోవాలా వద్దా అనే దశలో ఉందన్నారు. అభియోగాలు, బెదిరింపులతో జూన్‌లో జగన్ తనకు లేఖ రాశారని తెలిపారు. లోక్‌సభలో టీడీపీ నేత ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారనేది వాస్తవం కాదన్నారు. నాడు లోక్‌సభలో టీడీపీ(Telugu Desam Party) గ్రూపు నేత నాయకుడిగా మాత్రమే గుర్తించారని చెప్పారు. ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదాపైన జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఎలాంటి వారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వెళ్తున్నారని స్పీకర్ వెల్లడించారు. తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇవ్వాలని నిర్ణయించామని స్పీకర్ స్పష్టం చేశారు. 

ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సంఖ్యాబలం ఉండాలని చట్టం చెబుతోంది. కనీసం 18 మంది ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదని చట్టం చెబుతోందని ఆయన పేర్కొన్నారు. కనీసం 10 శాతం సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని జగనే గతంలో చెప్పారని స్పీకర్(AP Assembly Speaker) తెలిపారు. జగన్ కు అన్నీ తెలిసే అబద్ధాలు ఆడుతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తేల్చిచెప్పారు. అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడిన జగన్ ను క్షమించి వదిలేస్తున్నానని స్పీకర్ హెచ్చరించారు. సంధి ప్రేలాపనలుగా పరిగణించి సభాపతి హోదాలో క్షమిస్తున్నానని అయ్యన్న పాత్రుడు తెలిపారు. సభా సంఘానికి నివేదించాలని నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, గోరంట్ల స్పీకర్ ను కోరారు. సభా సంఘానికి నివేదించాల్సిన అంశాన్ని తదుపరి నిర్ణయిస్తామని స్పీకర్ వెల్లడించారు.