calender_icon.png 25 October, 2024 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

22-07-2024 02:03:27 AM

10 గంటలకు ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగం

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులు పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.  ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెలాఖరుతో ఓట్‌టాన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తవనున్న నేపథ్యంలో మరో మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను, అక్టోబర్‌లో పూర్తి స్ఠాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే  అవకాశం ఉన్నట్లు  సమాచారం.  ఈ నెల 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాలుగు శ్వేత పత్రాలను ప్రజల ముందు ఉంచారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  ఉదయం 8.30 గంటలకు వెంకటపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అసెంబ్లీకి వెళతారు. పసుపు రంగు దుస్తులు ధరించి, సైకిల్ గుర్తు కండువాలతో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని టీడీఎల్పీ సూచించింది.