అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రూ. 2.98 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్. రూ. 43.402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్. రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2.34 లక్షల కోట్లు. మూలధన వ్యయం అంచనా రూ. 32.712 కోట్లు.
రెవెన్యూ లోటు రూ. 34.743 కోట్లు.
ద్రవ్యలోటు రూ. 68,743 కోట్లు.
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
జీఎస్డీపీలో ద్రవ్యలోటు అంచనా 2.21 శాతం
ఏపీ 2024-25 బడ్జెట్ లో ఏ శాఖకు ఎంత కేటాయించారంటే
ఉన్నత విద్య- రూ.2,326 కోట్లు
ఆరోగ్యరంగం- రూ. 18,421
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి- రూ. 16,739
పట్టణాభివృద్ధి- రూ. 11,490 కోట్లు
గృహనిర్మాణం- రూ. 4,012 కోట్లు
జలవనరులు- రూ. 16,705 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం - రూ. 3,127 కోట్లు
ఇందనరంగం - రూ. 8,207 కోట్లు
రోడ్డు, భవనాలు- రూ. 9,554 కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ - రూ. 322 కోట్లు
పోలీసు శాఖ- రూ.8,495 కోట్లు
పర్యావరణం, అటవీశాఖ- రూ.687 కోట్లు
ఎస్సీ సంక్షేమం- రూ. 18,497 కోట్లు
ఎస్టీ సంక్షేమం - రూ.7,557 కోట్లు
బీసీ సంక్షేమం- రూ.39,007 కోట్లు
మైనార్టీ సంక్షేమం- రూ.4,376 కోట్లు
మహిళ, శిశు సంక్షేమం- రూ. 4,285 కోట్లు
నైపుణ్యాభివృద్ధి శాఖ- రూ. 1,215కోట్లు