calender_icon.png 16 November, 2024 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ వ్యవసాయ బడ్జెట్‌.. రైతు సంక్షేమానికి పెద్దపీట

11-11-2024 12:16:39 PM

అమరావతి: రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్‌ను రాష్ట్ర అసెంబ్లీలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ, వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. బడ్జెట్, మొత్తం రూ. 43,402 కోట్లు, వ్యవసాయ వృద్ధిని పెంచడం, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి అచ్చన్న తెలిపారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నుముక లాంటిందని మంత్రి వెల్లడించారు. 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిఉందని అచ్చాన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని ఆరోపించారు. భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. భూసార పరీక్షలకు రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ఉపయోగిస్తామన్నారు. రిమోట్ సెన్సింగ్ సాంకేతికతను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విత్తనాలు, సూక్ష్మ  పోషక ఎరువులు రాయితీపై అందిస్తున్నామని వెల్లడించారు. రాయితీ విత్తనాలకు రూ. 240 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువులు పంపిణీ చేస్తామని ఏపీ అసెంబ్లీలో పేర్కొన్నారు.