calender_icon.png 23 November, 2024 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మడగాస్కర్‌కు చెందిన రోగికి కిడ్నీ మార్పిడి

22-11-2024 10:01:12 PM

మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న మడగాస్కర్ నివాసి సైమన్ ఎరిక్కు..

మాదాపూర్ పేస్ హాస్పిటల్స్ సంక్లిష్టమైన ఏఓబి మూత్రపిండ మార్పిడి..

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): మడగాస్కర్‌కు చెందిన డయాలసిస్ రోగికి కిడ్నీ మార్పిడి అతనికి పునర్జన్మను  పేస్ హాస్పిటల్ వైద్యులు ప్రసాదించారు. డయాలసిస్ చేయించుకుంటున్న మడగాస్కర్‌కు చెందిన ప్రవాస భారతీయుడు ఎరిక్ దీర్ఘకాలంగా మధుమేహం వ్యాధితో బాధపడటమే కాకుండా గతంలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. ఫలితంగా రెండు కళ్ళు పూర్తిగా కంటిచూపు కోల్పోయారు. స్థూలకాయం, మధుమేహం వలన వచ్చే సమస్యలతో మార్పిడి చాలా సవాలుగా మారడంతో డాక్టర్ విశ్వంభర్‌నాథ్, డాక్టర్ అభిక్‌దేబ్నాథ్, డాక్టర్ రవిచంద్ర నేతృత్వంలోని కిడ్నీ మార్పిడి బృందం, క్లిష్టతరమైన ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ సందర్భంగా హాస్పిటల్ మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ విశ్వంభర్‌నాథ్ మాట్లాడుతూ ఇది చాలా క్లిష్టమైన మార్పిడి ప్రక్రియ, కానీ డాక్టర్ల బృందం అపార నైపుణ్యం వలన సర్జరీ విజయవంతమైందన్నారు. ఎరిక్ భార్య కిడ్నీని అతనికి దానం చేశారు. (ఓ పాజిటివ్)తో పోలిస్తే భిన్నమైన రక్త సమూహం (బి పాజిటవ్) కలిగి ఉండడంతో రక్తనీవి శుద్ధితో ల్య్రాపోస్కోపిక్ పద్దతులను ఉపయోగించి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. ప్రక్రియలో అత్యున్నత స్థాయి వైద్యం హాస్పిటల్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కిషోర్ కుమార్ పర్యవేక్షించారు.

సైమన్ ఎరిక్ ఒక ప్రవాస భారతీయుడు కావడంతో మడగాస్కర్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆమోదం, అవసరమైన అనుమతులను పొందేందుకు రోగి సజావుగా కోలుకోవడానికి దీర్ఘకాలిక మూత్రపిండాల పనితీరును పర్యవేక్షించడానికి తమ డాక్టర్ల బృందం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. విజయవంతమైన మార్పిడి తర్వాత, ఎరిక్ మంచి ఆరోగ్యంతో డిశ్చార్స్ అయ్యారని, అతని మూత్ర పిండాల పనితీరు స్థిరంగా ఉందని వెల్లడించారు.