calender_icon.png 4 April, 2025 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన ఏఓ

03-04-2025 04:22:29 PM

చెన్నూర్: భీమారం మండల కేంద్రంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను వ్యవసాయ అధికారి అత్తే సుధాకర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో రైతులు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేసిన వెంటనే రసీదు తప్పకుండా ఇవ్వాలని ఆదేశించారు. రైతులకు ఈ-పాస్ ద్వారానే ఎరువులను విక్రయించాలని డీలర్లకు సూచించారు.

ఎమ్మార్పీకి మించి అమ్మకాలు చేయొద్దు

ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి అత్తే సుధాకర్ హెచ్చరించారు. ఎరువులను ఎమ్మార్పీకే అమ్మాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే శాఖపరమైన కఠిన చర్యలు తప్పవని అన్నారు.