calender_icon.png 30 April, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే

29-04-2025 12:00:00 AM

అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్28(విజయక్రాంతి): పట్టుదల ఉంటే ఏదైనా సాధిం చవచ్చు అని అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో నేషనల్ మాస్టర్స్ గేమ్ భాగంగా నిర్వహించిన రన్నింగ్ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన శకుంతల, ఆనంద్‌రావులను సన్మానించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ వృద్ధాప్యంలోనూ అంతటి ఘనత సాధించడం గొప్ప విషయం అని తెలిపారు. నేటి యువ త వీరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు.