calender_icon.png 9 October, 2024 | 3:50 AM

అన్యోన్య కాపురం.. మధ్యలో ట్యాక్సీ డ్రైవర్

09-10-2024 01:51:51 AM

అతడి ట్రాప్‌లో పడి లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వివాహిత

శంషాబాద్ పోలీసులకు భర్త ఫిర్యాదు 

మహిళకు కౌన్సెలింగ్ నిర్వహించి తిరిగి లండన్ పంపిన పోలీసులు

రాజేంద్రనగర్, అక్టోబర్ 8: అందమైన కాపురం.. అడిగిందల్లా సమకూర్చే భర్త.. అయినా ఆమె మనసు పక్కచూపు చూసింది. ఓ ట్యాక్సీ డ్రైవర్ చెప్పిన ఆకర్షణీయమైన మాటలు అతడి ఉచ్చులో పడేలా చేశాయి. ఇంకేముంది దేశం దాటి, పిల్లలను వదిలేసి ట్యాక్సీ డ్రైవర్ కోసం వచ్చింది.

విషయం తెలుసుకున్న భర్త వెంటనే శంషాబాద్ పోలీసు లకు ఫిర్యాదు చేయడంతో వివాహితను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ నిర్వహిం చి భర్తకు అప్పగించి తిరిగి లండన్ పం పా రు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. 

అసలు ఏం జరిగిందంటే.. 

హైదరాబాద్ అల్వాల్ ప్రాంతానికి చెంది న దంపతులకు 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. భార్యాభర్తలు కొన్నేళ్ల క్రితం లండన్‌కు వెళ్లి ఉద్యోగం చేస్తున్నా రు. భార్యకు అడిగిందల్లా భర్త సమకూర్చేవాడు. ఇదిలా ఉండగా, గత ఫిబ్రవరిలో సదరు మహిళ తల్లి చనిపోగా ఇక్కడికి వచ్చింది. తల్లి అస్థికలను కలిపేందుకని ఓ ట్రావెల్స్ కంపెనీలో కారును అద్దెకు బుక్ చేసుకొని వెళ్లివచ్చారు. మహిళ ఆ ట్యాక్సీ డ్రైవర్‌కు గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించింది. దీంతో ఆమె నంబర్‌ను అతడు సేవ్ చేసుకున్నాడు. 

పిల్లలను పార్కులో వదిలేసి.. 

భర్త హైదరాబాద్ వెళ్లిందే అదనుగా సద రు వివాహిత సెప్టెంబర్ 29న పిల్లలను లండన్‌లోని ఓ పార్కులో వదిలేసి మరుసటి రోజు.. అంటే సెప్టెంబర్ 30న భారత్‌కు వచ్చింది. పిల్లలు తమ తండ్రికి జరిగిన విష యం చెప్పడంతో అతడు వెంటనే లండన్ వెళ్లి అక్కడ భార్య గురించి ఆరా తీశాడు. ఆమె శంషాబాద్‌కు వచ్చి మధురానగర్ కాలనీలో ఉంటున్నట్లు గుర్తించాడు.

అతడు భార్యకు ఫోన్ చేయగా.. అమాయకంగా తనను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారని, శంషాబాద్‌లో ఉంచారని చెప్పింది. మహిళ భర్త జరిగి న విషయాన్ని తన స్నేహితులకు చెప్పి వారిని అలర్ట్ చేశాడు. వారు ఆమెకు కాల్ చేయగా తనను ఓ ట్యాక్సీ డ్రైవ ర్ ట్రాప్ చేశాడని, తాను గోవాలో ఉన్నట్లు చెప్పింది.

తాను భర్త వద్దకు వెళ్తానని చెప్పడంతో వారు శంషాబాద్ పోలీసులకు విష యం తెలిపారు. అప్రమత్తమైన ఇన్‌స్పెక్టర్ బాలరాజు తన సిబ్బందిని రంగంలోకి దిం చారు. మహిళతో పాటు ఆమెను తీసుకెళ్లిన ట్యాక్సీ డ్రైవర్ సెల్‌ఫోన్లను ట్రాక్ చేసి వారు బస్సులో గోవా నుంచి వస్తుండగా రాయిక ల్ టోల్‌ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి మహిళ కు కౌన్సెలింగ్ నిర్వహించారు. సోమవారం రాత్రి 9.30 గంటలకు ఫ్లుటై టికెట్స్ బుక్ చేసి తిరిగి లండన్‌కు పంపారు. 

ట్యాక్సీ డ్రైవర్ ఎవరంటే.. 

ట్యాక్సీ డ్రైవర్‌ను పాతబస్తీ బాలాపూర్‌కు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించా రు. అతడు ఇంకెవరినైనా ట్రాప్ చేశాడా అనే కోణంలో విచారించగా.. అదేమీ లేనట్లుగా గుర్తించామని ఇన్‌స్పెక్టర్ బాలరాజు పేర్కొన్నారు. అనంతరం అతడిని విడిచిపెట్టారు. 

మీరు అందంగా ఉన్నారంటూ.. 

మహిళ ఫోన్ నంబర్‌ను సేవ్ చేసుకున్న ట్యాక్సీ డ్రైవర్ మెల్లిగా తన కుట్రకు తెరలేపాడు. ఆమె వాట్సాప్ నంబర్‌కు మెసేజ్‌లు పంపడం ప్రారంభించాడు. ‘మీరు చాలా అందంగా ఉంటారు.. మీ నవ్వు మరింత బాగుంటుంది’ అంటూ చాట్ చేయడం ప్రారంభించాడు. అతడి మాటలకు సదరు మహిళ కరిగిపోయిం ది.

తనకు భర్త.. పిల్లలు ఉన్నారని మరిచిపోయే స్థితికి వచ్చింది. విషయం నెమ్మది గా మహిళ అత్తగారింట్లో తెలవడంతో వారు తమ కుమారుడిని అప్రమత్తం చేశారు. దీంతో భర్త తన భార్యను గత సెప్టెంబర్ 16న లండన్‌కు రప్పించుకున్నాడు. అదే నెల 29న తన తల్లి మృతిచెం దగా భార్యాపిల్లలను అక్కడే వదిలేసి హైదరాబాద్ వచ్చాడు.