calender_icon.png 15 January, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమార్కుల ఆచూకీ ఏదీ?

06-07-2024 02:47:21 AM

  • పరారీలోనే రాయికల్ ఎస్సై, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ 
  • పరారై ఒకరు 15 రోజులు.. మరొకరు 10 రోజులు 
  • అదుపులోకి తీసుకోవడంలో పోలీస్ వ్యవస్థ విఫలం

జగిత్యాల, జూలై 5 (విజయక్రాంతి): పోలీసులు, అధికారులు ప్రజలకు అండగా నిలుస్తూ, వారికి మెరుగైన సేవలు అందించాల్సి ఉండగా, కొందరు తప్పుడు మార్గం పడుతున్నారు. అక్రమార్జన ఆశపడి సాధారణ ప్రజ లను ఇబ్బంది పెడుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో దం దాలకు పాల్పడుతున్నారు. జగిత్యాల జిల్లాలో కొందరు పోలీసులు, అధికారులు ప్రజలను పీడించడం, భూకబ్జాలకు పాల్పడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఏసీబీ ట్రాప్ నుంచి రాయికల్ ఎస్సై అజయ్ తప్పించుకుని 15 రోజులు గడుస్తున్నది. అలాగే భూవివాదం కేసులో అరెస్టయ్యేలోపు పరారైన జగిత్యాల ము న్సిపల్ కమిషనర్ అనిల్‌బాబు ఆచూకీ లేదు. ఆయన ఆచూకీ లేక 10 రోజులు దాటుతోంది. ఈ రెం డు ఉదంతాలు పోలీస్ నిఘా వ్యవస్థపై అనుమానాలు కలిగేలా చేశా యి. జిల్లావ్యాప్తంగా ఖాళీ స్థలాల కబ్జా ఉదంతాలు విరివిగా వెలుగు చూస్తున్నాయి. ఇసు క మాఫియా ఆగడాలు పెంచేస్తున్నాయి. 

ఆరాచకాలు ఇలా..

రాయికల్ రాయికల్ ఎస్సై అజయ్ తెరవెనుక అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సమగ్ర విచారణలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నా యి. కొందరు రాజకీయ నాయకుల అండ తో ల్యాండ్, ఇసుక సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు ఎస్సైపై ఆరోపణలు ఉన్నాయి. ఒకే భూమికి అనేక సార్లు రిజిస్ట్రేషన్లు చేయించడం వంటి అక్రమాలు చేయించాడని తెలుస్తున్నది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారి నుంచి రాయికల్ ఎస్సై రూ.50 వేల వరకు డిమాండ్ చేయగా, బేరసారాల తర్వాత రూ.25 వేలకు ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. మధ్యవర్తితం నడిపిన వ్యక్తి దారా రూ.15 వేలు తీసుకొని, మరో రూ.10 వేలు ఇవాల్సిందేనని పట్టుబట్టిన ఎస్సైని ఏసీబీకి పట్టించాలనే స్కెచ్ అమలుకావడంతో ఆయన పరరారైనట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది.

పేకాట స్థావరాలు నిర్వహించే వారి నుంచి సదరు ఎస్సై వసూళ్లకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నా యి. పోలీసుల్లోనే కొందరిని ఏజెంట్ల నియమించుకుని దందా కొనసాగించినట్లు తెలు స్తోంది. పోలీసులు సివిల్ కేసుల్లో తలదూర్చొద్దని జిల్లా ఎస్పీ స్పష్టంగా సూచి స్తున్నప్పటికీ, కొందరు పోలీస్ అధికారులు వాటిని పెడచెవిన పెడుతున్నారు. జగిత్యాల, కోరుట్ల పట్టణాల్లో కొందరు స్థలాలను ఆక్రమించి ప్రహరీ నిర్మించడం, అడ్డువచ్చిన వారిని రాజకీయ బలంతో బెదిరించడం వంటి దురాగతాలకు పాల్పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మరోవైపు జగిత్యాల మున్సిపల్ కమిషనర్ అనిల్‌బాబు, ఆర్వో భూవివాదంలో చిక్కుకోగా, ఆర్వో అరెస్ట్ అయి కమిషనర్ పరార్ అవడం విమర్శలకు తావిస్తోంది. ఎస్సై అక్రమాలకు పాల్పడినట్లే మున్సిపల్ కమిషనర్ కూడా భూపందేరాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇద్దరు అక్రమా ర్కులను అదుపులోకి తీసుకోవాలని ప్రజ లు కోరుతున్నారు. అలాగే అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు.