calender_icon.png 13 February, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పింక్‌బుక్ ఏదీ?

13-02-2025 01:10:20 AM

  1. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి 12 రోజులు
  2. ఇంకా తెలియని రైల్వే కేటాయింపులు

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్‌తో పాటు రైల్వే బడ్జెట్ సైతం ప్రత్యేకంగా ఉండేది. రైల్వే బడ్జెట్ సందర్భంగా రైల్వేమంత్రి బడ్జె ట్ ప్రసంగం చేస్తుంటే మన రాష్ట్రానికి ఎన్ని రైళ్లు వచ్చాయి.. ఎన్ని కొత్త లైన్లు మం జూరయ్యాయి.. తదితర విషయాలు తెలిసేవి. 2017 నుంచి ప్రత్యేక రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు.

కేంద్రం ప్రధాన బడ్జెట్‌లోనే రైల్వేలకు కేటాయింపులు చేస్తూ వస్తోంది. ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌కు రూ.2.55 లక్షల కోట్లు కేటాయించగా తెలంగాణకు కేవలం రూ. 5337 కోట్లు కేటాయించారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన మూడు రోజులకు ఫిబ్రవరి 3న రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ వివరా లు వెల్లడించారు.

అయితే రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో ఏయే ప్రాజెక్టులకు ఎంత కేటాయించారో చెప్పేం దుకు రైల్వే బోర్డు పింక్‌బుక్‌ను ప్రచురిస్తుంది. ఆ పింక్ బుక్‌ను ఆయా జోన్ల కు పంపుతారు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టి 12 రోజులు గడిచినా ఇంకా పింక్ బుక్ రాలేదు.