calender_icon.png 19 April, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంచ భూములపై విచారణ ఏదీ? X భూముల అమ్మకంపై చర్చకు సిద్ధమా?

18-04-2025 12:35:25 AM

కంచ భూములపై విచారణ ఏదీ?

  1. జరిగిన విధ్వంసం ప్రధాని మోదీకి కనిపించడం లేదా?
  2. కాంగ్రెస్ సర్కార్‌ను మేం కూల్చం.. ప్రజలే తిరుగుబాటు చేస్తారు: కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణపై బీజేపీ సర్కార్‌కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కంచ గచ్చిబౌలి వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబా ద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వ హించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన కర్మ తమకు పట్టలేదని, బంగ్లాదేశ్‌లో లాగా అసంతృప్తి పెరిగి ప్రజలే ప్రభుతాన్ని కూలదూస్తారని తెలిపారు. దేశంలో తెలిసారిగా ఇందిరాగాంధీ హరియాణాలో ఆయా రాం.. గయారం సంస్కృతిని ఆరంభించారని, అప్పటి నుంచి నేతల పార్టీ ఫిరాయిం పులు మొదలయ్యాయని చెప్పారు.

ఇటీవల మా పార్టీ ఎమ్మెల్యేలను సైతం కాంగ్రెస్ పార్టీయే లాక్కొందని కేటీఆర్ ఆరోపించారు. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు వాదోపవాదాలు విన్న తర్వాత దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద మ రింత గౌరవం పెరిగిందని చెప్పారు.

హెచ్‌సీయూలోని 100 ఎకరాలను ఎప్పుడు పున రుద్ధరిస్తారో స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో రా కుంటే, అదే స్థలంలో తాత్కాలిక జైలు ఏర్పా టు చేసి, అధికారులను జైలుకు పంపుతామ ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని, ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఇంతటి ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారన్నారు. ఆత్మాభిమానం ఉన్న ఏ సీఎం అయి నా కోర్టు వ్యాఖ్యలపై ఈపాటికే రాజీనామా చేసేవారని కేటీఆర్ అన్నారు.

తమ వాదనలకు బలం చేకూరేలా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ తమ నివేదిక కోర్టుకు సమర్పించిందని చెప్పారు. ఆ 400 ఎకరాల భూమి హె చ్‌సీయూదేనని ఎంపవర్డ్ కమిటీ స్పష్టం చేసిందని గుర్తుచేశారు. భూయాజమాన్య హక్కులు తేలే దాకా తనఖా, లీజు పాటు కట్టడాలు అక్కడ నిర్మాణాలను తక్షణమే ఆపేలా సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని ఎంపవర్డ్ కమిటీ చెప్పిందని కేటీఆర్ తెలిపారు.

గతంలో ఆర్‌ఆర్ ట్యాక్స్ అని, తాజాగా హెచ్‌సీయూ భూములపై మాట్లాడిన ప్రధాని మోదీకి.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక దోపి డీ, పర్యావరణ విధ్వంసం కనపించడం లేదా అని ప్రశ్నించారు. ఏబీవీపీతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనలు కూడా కేంద్ర ప్ర భుత్వానికి పట్టడం లేదా అని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ వైఖరిపై ఈ నెలాఖరు వరకు ఎదురుచూస్తామని, లేదంటే తామే కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆధారాలిచ్చి, విచారణ చేయాలని కోరుతామన్నారు.

అవినీతి సర్కా ర్ అంటూ ఆరోపిస్తున్న బీజేపీ పార్టీ రేవంత్ ప్రభుత్వంపై చర్యలు తీసుకునేందుకు ఎందు కు వెనకాడుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీకి రేవంత్ మూటలు పంపుతున్నందునే రాహుల్ సెంట్రల్ యూనివర్సిటీ భూవివాదంపై మాట్లాడటం లేదని కేటీఆర్ ఆరోపిం చారు. పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కుతూ టీజీఐఐసీ అక్కడ చెట్లను నరికిందన్నారు.

తనది కాని భూమిని టీజీఐఐసీ తాకట్టుపెట్టి పదివేల కోట్లు అప్పు తీసుకోవడం తప్పుకాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ భూముల్లో ఉన్న చెరువులను కూడా రేవంత్ సర్కార్ తాకట్టు పెట్టిందని, చెరువులను తనఖా పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని కేటీఆర్ మండిపడ్డారు. కొందరు పోలీసులు రేవంత్ ప్రైవేట్ సైన్యం లా వ్యవహరిస్తున్నారని, తమపై అక్రమకేసులు పెడితే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామ న్నారు.

రీట్వీట్లు చేసినా ప్రభుత్వం కేసులు పెడుతోందని, సీఎం చేస్తున్న అక్రమాలతో అధికారులు బలి పశువులు అవుతున్నారన్నారు. ఫార్ములా రేసులో మంత్రిగా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పానని, అధికారులను బలిపశువులను చేయలేదని కేటీఆర్ చెప్పారు.  రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై సో షల్ మీడియాలో కంటే ప్రజాక్షేత్రంలోనే ప్ర జా వ్యతిరేకత ఎక్కువగా ఉందన్నారు. 

ధాన్యం కొనుగోళ్లనే మరిచిన సర్కార్

భూముల అమ్మకాల్లో బిజీగా ఉన్న స ర్కార్, ధాన్యం కొనుగోళ్లనే మరచిపోయింద ని కేటీఆర్ విమర్శించారు. శ్మశానం దగ్గర ఏ ర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వల్ల రైతుల ఇబ్బందులు పడుతున్న అంశం పై కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్ట్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో రైతులపై మరణమృదంగం మోగుతోందని విమర్శించారు.

భూముల అమ్మకంపై చర్చకు సిద్ధమా?

  1. కంచ గచ్చిబౌలి భూములు ప్రైవేట్‌పరం చేయం 
  2. సుప్రీం కోర్టు వ్యాఖ్యలను వక్రీకరించవద్దు
  3. కవిత రౌడీ కాబట్టే  ఢిల్లీలో లిక్కర్ దందా చేసింది 
  4. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ భూముల అమ్మకాలకు సంబంధించి చర్చకు కేటీఆర్ సిద్ధమా..? మీడియా సమక్షంలోనే నేను చర్చకు సిద్ధ్దం..? అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ చుట్టూ వేల ఎకరా ల భూములను చౌకగా అమ్మేశారని ఆరోపించారు.

గురువారం  మహేశ్‌గౌడ్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ హయాంలో భూముల అమ్మకం విషయంలో అనేకసార్లు కోర్టులు మొట్టికాయలు వేశాయని, ఇప్పుడు భూముల గురించి మాట్లాడటానికి కేటీఆర్‌కి సిగ్గుండాలని మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి భూములను ప్రైవేట్‌పరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.

భూ ములకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు విషయాన్ని కేటీఆర్, హరీశ్ రావు పక్క దారి పట్టిస్తున్నారని మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యలను వక్రీక రిస్తున్న కేటీఆర్, హరీశ్‌రావు తమ తలలను  ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా? అని నిలదీశారు.

హెచ్‌సీ యూ భూముల్లో పారిశ్రామిక ప్రగతితో 5 వేల ఉద్యోగాలు వ స్తాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకోవడమే బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు పనిగా పెట్టుకు న్నారన్నారు. కోర్టులంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవమన్నారు.

హెచ్‌సీయూ భూములపై ఏఐతో ఫేక్ విడియో లను సృష్టి స్తే, వాటిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రీపోస్టు చేశారని, సాక్షాత్తు ప్రధానమంత్రి సైతం భూములకు సంబంధించి అవాస్తవా లు మాట్లాడారని తెలిపారు. రేవంత్ రెడ్డిని సీఎం పదవిని నుంచి దిగిపొమ్మటానికి కేటీఆ ర్‌కు సిగ్గుండాలని మహేష్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు.