బైక్‌లకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చుతున్న యువత
దృష్టి సారించిన పోలీస్ యంత్రాంగం
సైలెన్సర్ల ధ్వంసంతో పాటు కేసులు నమోదు
సిద్దిపేట, జూలై 11 (విజయక్రాంతి): ఇటీవలి కాలంలో కొందరు యువత ద్విచక్ర వాహనాలకు సంబంధిత సంస్థ ఇచ్చిన సైలెన్సర్లను మార్పు చేసి అధిక శబ్ధం వచ్చే వాటిని అమర్చుతున్నారు. దీనివల్ల విపరీతమైన ధ్వని కాలుష్యం ఏర్పడడంతో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొందరు వాహనాల హారన్లను సైతం అదే తరహాలో అమర్చుతున్నారు. దీంతో చెవులు చిల్లులు పడేలా సైరన్ మోత మోగుతోంది. ఈ క్రమంలో పోలీస్ యంత్రాంగం దృష్టి సారించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ద్విచక్ర వాహనాలకు మోడిఫైడ్ స్లున్సర్లు అమర్చిన వారిపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
జిల్లాలో 3 లక్షలకు పైగా బైక్‌లు..
సిద్దిపేట జిల్లాలో సుమారు 3 లక్షలకు పై గా ద్విచక్ర వాహనాలు ఉన్నట్టు అధికారుల అంచనా. యువకులు వాహనం నడుపుతున్నపుడు అందరి దృష్టి తమపై ఉండాలనే ఆలోచనతో ఇలా సైలెన్సర్లు మార్చుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కానీ రోడ్డుపై భారీ శబ్ధం వల్ల కర్ణభేరి దెబ్బతినడం, హృద్రోగులకు ఇబ్బంది కలగడం వంటివి జరు గుతున్నాయి. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్ పట్టణాల్లో ఇలాంటి వాహనాలు అధికంగా ఉన్న ట్లు పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల వరకు ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. అయినప్పటికీ కొందరిలో మార్పు రాకపోవడంతో పోలీసులు చట్టాల కు పని చెప్పారు. నాలుగు నెలలుగా ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై ప్రత్యేక నిఘా పెట్టి వాహనాల తనిఖీలు చేపట్టారు. మోటార్ వాహన చట్టం కింద పలువురిపై కేసు నమో దు చేశారు. అలాగే సైలెన్సర్లను తొలగించి ధ్వంసం చేశారు. ద్విచక్ర వాహనానికి 80 డెసిబుల్స్ శబ్ధం మాత్రమే రావాల్సి ఉంది. అంతకంటే అధికంగా వస్తే చట్టం ప్రకారం రూ.1000 జరిమానా విధించడంతో పాటు సైలెన్సర్‌ను తొలగిస్తారు. అయిప్పటికీ వాహనదారులలో మార్పు రాకపోతే కేసు నమోదు చేసి జైలుకు పంపుతారు.
మెకానిక్‌లపైనా దృష్టి సారిస్తేనే..
అధిక శబ్ధాన్నిచ్చే సైలెన్సర్లు బిగించే బైక్ మెకానిక్‌లపై, ఆ సామగ్రి విక్రయించే వ్యాపారుల వైపు పోలీసులు దృష్టి సారిస్తే మోడి ఫైడ్ సైలెన్సర్లను అడ్డుకునే అవకాశం ఉం టుంది. ద్విచక్ర వాహనానికి కంపెనీ బిగించిన సైలెన్సర్ కాకుండా అధిక శబ్ధాన్నిచ్చే సైలెన్సర్ కోసం రూ.10 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. అయితే, కొంతమంది ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి గుట్టచప్పుడు కాకుండా కొనుగోలు చేయడం లేదా అక్కడే బిగించుకుంటున్నట్ల తెలుస్తోంది.
50 కేసులు నమోదు..
జిల్లాలో అత్యధికంగా గజ్వేల్, సిద్దిపేట ప్రాంతంలోనే అధిక శబ్ధం వచ్చే వాహనాలు ఉన్నాయి. దశల వారీగా తనిఖీలు చేపట్టి మోడిఫైడ్ సైలెన్సర్లను గుర్తిం చాం. ఇప్పటి వరకు 50 వాహనాలపై కేసు నమో దు చేశాం. ద్విచక్ర వాహనాలకు బిగించిన సైలె న్సర్లను తొలగించాం. అధిక శబ్ధాన్నిచ్చే సైలెన్సర్లను బిగించిన వారు వెంటనే వాటిని తొలగించాలి. అలాగే పట్టుబడితే క్రిమినల్ కేసు నమోదు చేస్తాం.
డాక్టర్ అనురాధ,
పోలీస్ కమిషనర్, సిద్దిపేట