- ప్రణాళికలు సిద్ధం చేసుకోండి
- అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలానికి ఎంతటి విపత్తు వచ్చినా ఎలా ంటి నష్టం వాటిల్లకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మ ంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను ఆదేశించారు. గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహించినా పరివాహక ప్రాంతాలు నష్టపోకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బుధవారం భద్రాచలంలో గోదావరి వరదలపై నిర్వహించిన జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
అన్ని శాఖల అధికారుల నుం చి గోదావరి వరదల కారణంగా జరిగిన నష్ట ం గురించి తెలుసుకున్నారు. వరదల్లో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లకుండా సమర్థవంతంగా పనిచేసినందుకు అధికారులను అభి నందించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. ప్రతి గ్రామానికి వాహనాలు వెళ్లేలా వ దరలకు దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్, తాగునీటి సమస్యలు తలెత్తకుందా చూడాలన్నారు.
భధ్రాచలం పట్టణంలో 24 గంటలపాటు తా గునీరు అందించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. కరకట్ట లోపల గోదావరి స్థల ంలో ఎటువంటి నిర్మాణాలు లేకుండా చర్య లు తీసుకోవాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. వరదల్లో నష్టపోయిన అందరికీ పరిహారం అందుతుందని ఎవరూ అధైర్యపడవద్దని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
అభివృద్ధి జరగాలంటే స్థలం అవసరం
భద్రాచలం అభివృద్ధి జరగాలంటే ముం దుగా భూమి కావాలని మంత్రి తుమ్మల అన్నారు. అందుకు పోలవరం ముంపు పేరు తో ఆంధ్రాలో కలిపిన ఐదు పంచాయతీల ను తిరిగి భద్రాచలంలో కలిపేందుకు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పిస్తామన్నారు. రామాలయం అభివృద్ధికి భూసేకరణ త్వరగా చేపట్టాలని అధికారులకు సూచించారు. సమావేశంలో భద్రాచలం ఎమ్మేల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, ఆర్డీవో దామోదర్‌రావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.