calender_icon.png 8 November, 2024 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌లో ఆందోళన

08-08-2024 12:14:11 AM

బంగ్లా పరిణామాల నేపథ్యంలో అక్కడి మైనారిటీల రక్షణ భారత్‌కు ప్రాధాన్యాంశంగా మారిందని కేంద్రం వెల్లడించింది. బంగ్లాలో పరిస్థితులపై ముఖ్యంగా మైనారిటీల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ మంగళవారం పార్లమెంట్‌లో ఆందోళన వ్యక్తం చేశా రు. బంగ్లాలో 19వేల మంది భారతీయులు ఉన్నారని, వారితో నిరంతరం టచ్‌లో ఉండేలా ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. మరోవైపు బంగ్లాలో భారతీయుల పరిస్థితిపై జైశంకర్‌తో పాటు ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమావేశమై వివరాలు తెలుసు కున్నారు. కాగా, ఎయిరిండియాకు చెందిన ప్రత్యేక విమానం 205 మంది భారతీయులను వెనక్కి తీసుకువచ్చింది. వీరిలో 190 మంది అక్కడి భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులని తెలుస్తోంది. మిగిలిన 20 మంది సీనియర్ దౌత్య వేత్తలు మాత్రం బంగ్లాదేశ్‌లోనే ఉండిపోయినట్లు తెలుస్తోంది. భారత్‌కు వచ్చినవారిలో ఓ వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ అక్కడి పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేశాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు అక్కడి పరి స్థితులు భిన్నంగా ఉన్నాయన్నాడు.