మార్కెట్ యార్డుల్లో తూకం వేసిన జొన్నల బస్తాలు
ఖరీఫ్ సాగు రైతుల్లో నెలకొన్న ఆందోళన
బోథ్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మొక్కజొన్న జొన్న పంట కొనుగోలు జరుగుతుండగా తూకం వేసిన బస్తాలు లారీల కొరతతో మార్కెట్లోనే ఉండిపోయాయి. దీంతో రైతులు వారాల తరబడి తూకం వేసి ఉంచిన బస్తాల వద్ద కాపలా కాయాల్సి వస్తుంది. తూకం వేసి ఇచ్చిన పంటను తీసుకు వెళ్లాలని రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన లారీలు లేక పంట బస్తాలు ఎక్కడికక్కడే ఉన్నాయి. మరో 15 రోజుల్లో మృగశిర కార్తె వస్తుండటం ఖరీఫ్ పంటలు సాగు చేసే రైతులు పంట భూములను సిద్ధం చేసుకోవాల్సి ఉంది.
అయితే రైతాంగానికి సమయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలం నెత్తి మీద వచ్చింది ఈ ఏడు ఎట్లానో వేసవికాలం ముగిసిపోతున్నది .15 రోజుల్లో. వర్షాలు కురిసే సమయం దగ్గరికి వచ్చింది. ఇంకా భూములు విత్తనాలు నాటేందుకు సిద్ధం చేయలేకపోయాం. ప్రతి ఏటా రైతుబంధు విత్తనాలకు ఆసరా అయ్యేవి ఇప్పుడు ఏమైనా పంటల డబ్బులు గత ఏడాది పెట్టిన పెట్టుబడులకే సరిపోగా కందులు మొక్కజొన్న జొన్నల డబ్బులు ఇప్పట్లో వచ్చేలా లేవు.అయితే పంట పెట్టుబడుల కోసం ప్రైవేటు దళారీల దగ్గరకు వెళ్లాల్సి వస్తున్నది.
దళారీల సైతం ఈ ఏడాది పెట్టబడును ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. అప్పులు ఇచ్చి కేసుల్లో ఇరుక్కోవడం ఎందుకని అంటున్నారని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అమ్మిన పంట డబ్బులు రాక అప్పు పుట్టగా రైతులు అయోమయానికి గురవుతున్నారు. పదిమందికి పొట్టెడు అన్నం పెట్టే రైతన్న దీనస్థితిలో అప్పుల కోసం వెంపలాడుతున్నారు. బ్యాంకులు ఇచ్చే పంట రుణాలు ఏ మూలకు సరిపోవని ప్రభుత్వం ఎకరానికి కనీసం 80000 ఇవ్వాలని కోరుతున్నారు. ఏది ఏమైనా ఈసారి రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని అంటున్నారు.
తాకట్టులో గృహాలు బంగారం ఆభరణాలు ఏడాది పంట పెట్టుబడుల కోసం అప్పు పుట్టేదిగా లేదని తెలుసుకున్న రైతులు వారి వారి కుటుంబాల మహిళల మెడలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెడుతున్నారు. మరోవైపు నివాస గృహాలను సైతం ప్రైవేట్ ఫైనాన్షిలకు తాకట్టులో పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. ప్రైవేట్ బ్యాంకులవారు కొంతమేరకు నిబంధనలను సడలించి గృహ రుణాలు ఇస్తుండడంతో వేలాది మంది రైతులు ప్రైవేటు బ్యాంకుల్లో రుణం తీసుకుంటున్నారు. తీసుకున్న రుణం పుట్టాలంటే కాలం కలిసి రావాలని లేకుంటే తమ నివాస గృహాలు ప్రైవేటు బ్యాంకులవారికి తాకట్టు పెట్టుకోవాల్సిందేనని అంటున్నారు. ఏది ఏమైనా రైతు జీవితం అగమ్య గోచరంగా మారిందని పరిశీలకులు అంటున్నారు






