పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్
హైదరాబాద్, ఆగస్టు 26(విజయక్రాంతి) : తమ పదేళ్ల పాలనలో చెరువులు, కుంటలను బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసి కాలేజీలు, ఆసుపత్రులు, పెద్ద పెద్ద భవనాలు కట్టారని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆరోపించారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్రెడ్డి గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బఫర్ జోన్లో అనురాగ్ కాలేజీల నిర్మాణం చేశారని ధ్వజమెత్తారు. ఒక ప్రజాప్రతినిధిగాహైడ్రాను స్వాగతించాల్సింది పోయి.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని పల్లాను ఉద్దేశించి అన్నారు. యూనివర్సిటి ఏర్పాటులో ఉన్నత విద్యామండలి నిబందనలను కూడా పాటించలేదని ఆరోపించారు.