హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24(విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీలో ఈ నెల 27న ‘తేజస్ 2కే25’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. పీ భా తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ఇంజనీరింగ్ ఎక్స్‌పోలో 200కు పైగా కొత్త ఆవిష్కరణలను ప్రదర్శిస్తారని తెలిపారు.
ఉదయం ౧౦ గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని విద్యాసంస్థల విద్యార్థులు, అధ్యాపకులు, రావొచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ము అతిథులుగా అనురాగ్ యూనివర్సిటీ వీసీ ప్రొ.యూబీ దేశాయ్, నేష ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ డీజీ డా. ఎస్ గ్లోరీస్వరూప, రాష్ట్ర మాజీ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డా.శాంత తౌట టెక్నిప్ ఎఫ్‌ఎంసీ డైరెక్టర్ అర్జున రామళ్ల పాల్గొంటారన్నారు.