01-03-2025 12:00:00 AM
అడివి శేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘డకాయిట్’. మృణాల్ ఠాకూర్ కథానాయిక. మేకర్స్ ఇప్పుడు తారాగణంలో మరో స్పెషల్ ఎట్రాక్షన్‌ని సైతం రివీల్ చేశారు. ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ ప్రాజెక్ట్‌లో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించబోతున్నారు. నిజాయితీ, ధైర్యవంతుడైన అయ్యప్ప భక్తుడైన ఫియర్ లెస్ ఇన్‌స్పెక్టర్‌గా అనురాగ్ కశ్యప్ కనిపించనున్నారు. సినిమాపై క్యురియాసిటీని పెంచుతూ మేకర్స్ ఇంటె న్స్, యాక్షన్ -ప్యాక్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌ను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు.