22-03-2025 12:00:00 AM
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజాచిత్రం ‘పరదా’. ‘సినిమా బండి’తో హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. సంప్రదాయపు కట్టుబాట్లు మహిళలను ఎలా అణచివేస్తున్నాయి. ఎలా ఎదగకుండా అణగదొక్కుతున్నాయి.. వాటిని దాటి మహిళలు ఎలా ఎదుగుతున్నారు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతున్నట్టు ఇటీవల విడుదలైన టీజర్‌ను బట్టి తెలుస్తోంది.
మలయాళ నటి దర్శన, సంగీత ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా ఇందులో స్టార్ హీరోయిన్ సమంత ఓ అతిథి పాత్రలో కనిపించనున్నట్టు ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. సమంత, అ. సమంత, అనుమప గతంలో ‘అ ఆ’ చిత్రంలో కలిసి నటించారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నుంచి ఆదివారం ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ‘మా అందాల సిరి’ అనే ఓ పాటను రిలీజ్ చేయడం ద్వారా మ్యూజికల్ జర్నీని ప్రారంభించనున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి.