‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన పలు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యమైన ఆయన ఆ సంస్థతో తన సంబంధాన్ని కొనసాగిస్తూ తాజాగా ఆ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘ది ఇండియా హౌస్’లో ముఖ్య పాత్రను పోషించనున్నారు. రామ్‌చరణ్ సమర్పణలో రామ్ వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘ది ఇండియా హౌస్’ చిత్రానికి విక్రమ్‌రెడ్డి నిర్మాణతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్, సాయి మంజ్రేకర్‌తోపాటు అనుపమ్ ఖేర్ ప్రధాన తారాగణంగా ఉండగా, ఇందులో ఆయన చాలా క్రూషియల్ రోల్‌లో నటిస్తున్నారు. 1905 హంపీ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్, రెవెల్యూషన్ థీమ్‌తో రూపొందుతున్న ఈ పీరియాడిక్ మూవీకి సంబంధించి తాజా షెడ్యూల్‌లో అనుపమ్ ఖేర్ పాల్గొంటున్న విషయాన్ని మేకర్స్ వెల్లడించారు.