హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): వాతావరణ శాఖ హైదరాబా ద్ నగర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తండా ఉండాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. సోమవారం ఓఆర్‌ఆర్ వెంట జరుగుతున్న పూడికతీత పనులను స్వయం గా ఆయన పరిశీలించారు. పనులు చేస్తున్న సిబ్బందిఇకి పలు సూచనలు చేశారు. గత సంవత్సరం నీరు భారీగా నిలిచిపోయిన కొల్లూరు జంక్షన్, మల్లంపేట, షామీర్‌పేట ప్రాంతాల్లో ఆయనతోపాటు హెజీసీఎల్ సీజీఎం రవీంద్ర, ఐఆర్‌బీ ఇంజినీర్లు, ఇతర అధికారులు కలిసి పర్యటించారు. ఓఆర్‌ఆర్ మీద వెళ్లే వాహనదారులందరికీ సాయం చేసేందుకు పెట్రోలింగ్ బృందాలను మరింతగా పెంచాలని, వేరియబుల్ మెసేజ్ సైన్ (వీఎంఎస్) బోర్డుల మీద రెయిన్ అలర్ట్ మెసేజీలు చూపిస్తూ వాహనదారులను అప్రమత్తం చేయాలన్నారు.