calender_icon.png 25 January, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుబోస్ విద్యార్థులకు ఆర్థిక సాయం

24-01-2025 06:44:41 PM

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని అనుబోస్ విద్యార్థులకు పవన్ కుమార్ జ్ఞాపకార్ధంగా పవన్ కుమార్ సతీమణి కుటుంబ సభ్యులు ఉన్నత విద్యను అభ్యర్థిస్తున్నటువంటి ఐదుగురు విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తూ చేయూతనిచ్చారు. వారికి ఒక్కొక్కరికి స్కాలర్షిప్ రూపంలో రూ.20 వేలు శుక్రవారం కళాశాల ఆవరణలో అందజేశారు. వారితో పాటు నేషనల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా చదువుతున్న పూర్వ విద్యార్థిని ఆళ్ల హరిణి ఒక్కొక్కరికి రూ.20వేల స్కాలర్షిప్ అందజేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ భరత్ కృష్ణ పాల్గొని మాట్లాడుతూ... ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటునటువంటి విద్యార్థినిలు వారి యొక్క ఆశయాలు అధిగమించాలని అదేవిధంగా వారు కూడా దాతలుగా భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆశించారు. అనంతరం దాత భాగం శిరీష మాట్లాడుతూ... ఈ స్కాలర్షిప్ ద్వారా విద్యార్థులకు మంచిగా చదువుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ అవని, ప్రిన్సిపాల్ రవి, డాక్టర్ సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్ వెంకన్న, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.