calender_icon.png 12 March, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్కాజిగిరిలో అను కృష్ణ ఆస్పత్రి సీజ్..

11-03-2025 10:58:58 PM

మేడ్చల్ (విజయక్రాంతి): మల్కాజిగిరిలో అను కృష్ణ ఆసుపత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమా గౌరీ, మల్కాజిగిరి డివిజన్ వైద్యాధికారిని డాక్టర్ శోభారాణి, డాక్టర్ వినోద్ మంగళవారం ఆస్పత్రిని తనిఖీ చేశారు. సీఈఏ కు సంబంధించి సూచనలను పేర్కొనకపోవడం, ఇతర నిర్వహణ లోపాలు గుర్తించారు. ఆన్లైన్లో ఎంట్రీలు చేయకపోవడమే గాక, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించడంతో సీజ్ చేశారు. అలాగే డిఎం ఆసుపత్రికి నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమా గౌరీ మాట్లాడుతూ... నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.