ఐటీడీఏ అధికారులను ఆదేశించిన పిఓ రాహుల్...
భద్రాచలం (విజయక్రాంతి): ఐటిడిఏ ప్రాంగణంలో పర్యాటకులు సందర్శించడానికి ముస్తాబు చేస్తున్న మ్యూజియంలో గిరిజన కల్చర్ కు సంబంధించిన వేరే ఇతర పాతకాలపు వస్తువులు ఏమైనా ఉంటే సేకరించి మ్యూజియంలో ఏర్పాటు చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సంబంధిత గిరిజన ప్రతినిధులకు సూచించారు. సోమవారం నాడు ఉదయం పివి టీజీ గిరిజన ప్రతినిధులు, కమిటీ సభ్యులతో కలిసి ఆయన మ్యూజియమును సందర్శించి బోటింగ్ షికారు చేసే చెరువు పనులు, చిన్నారులకు ఏర్పాటు చేస్తున్న క్రీడా స్థలం, బాక్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... పాతకాలపు గిరిజన కల్చర్లకు సంబంధించిన కళాఖండాలు చాలావరకు సేకరించి మ్యూజియంలో సమకూర్చడం జరిగిందని, ఇంకా పాతతరంకి సంబంధించిన కళాఖండాలు ఇతర వస్తువులు ఏమైనా ఉంటే గ్రామాలలో సేకరించి అందజేయాలని అన్నారు.
90 శాతం గిరిజన కల్చర్‌కు సంబంధించిన అన్ని పాతకాలపు వస్తువులు సమకూర్చడం జరిగిందని, కాకపోతే గిరిజనులు గిరిజన సంప్రదాయ ప్రకారం చేసుకునే పెళ్లి తంతుకు సంబంధించిన వస్తువులను మ్యూజియంలో సమకూర్చిదానికి సంబంధించిన వివరాలు పర్యాటకులకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేయాలని, శ్రీరామనవమి నాటికి మ్యూజియం పనులు పూర్తిచేసి వచ్చే భక్తుల కొరకు తప్పనిసరిగా మ్యూజియం సందర్శించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని, అందుకు గిరిజన ప్రతినిధులు ఇప్పటినుండే మ్యూజియం సంబంధించిన కళాఖండాల గురించి ప్రతి గ్రామంలో తెలిసే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, ఎస్ ఓ భాస్కర్, ఏసీఎంఓ రమణయ్య, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్, డిఇ హరీష్, జేడీఎం హరికృష్ణ, మ్యూజియం ఇంచార్జ్ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.